రిటైర్డ్ ఉద్యోగులకు భద్రత కల్పించాలి
సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దర్శన్ గౌడ్
ముషీరాబాద్,ఆగస్టు 4 (విజయక్రాంతి): రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులు పెన్షన్, ఆరోగ్య భద్రత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పదవీ వి రమణ పొందిన సుమారు 600 మంది సీ పీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, డీఏ, ఈఎల్ సరెండర్, కాంట్రిబ్యూషన్ బకాయిలు పెండింగ్లో ఉండటంతో పెన్షన్ అమలు ఆలస్యమవుతోందని తెలిపారు.
పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేసే వరకు రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని,1.5 శాతం హెల్త్ స్కీమ్ కాంట్రిబ్యూషన్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అన్ని పెండింగ్ బకాయిలను వడ్డీతో ఒకేసారి చెల్లించాలని, ఉద్యోగి-ప్రభుత్వం చెల్లించే సీపీఎస్ కాంట్రిబ్యూషన్లు ప్రతి నెలా పీఆర్‌ఏఎన్ ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మరణించిన సీపీఎస్ ఉద్యో గుల కుటుంబాలకు కుటుంబ పెన్షన్తో పా టు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని, ఆరోగ్య పథకాల రూపకల్పనలో సీపీఎస్ ఉద్యోగుల సం ఘానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభు త్వం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.






