మోదీ పర్యటనలో భద్రతలోపం!
11-05-2026 01:08 AM
కాన్వాయ్‌కు అడ్డుపడిన ఆప్ మహిళా నేత
సికింద్రాబాద్, మే 10 (విజయక్రాంతి): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌం డ్‌లో జరిగే బహిరంగ సభలో భద్ర తా లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రధాని మోదీ బేగంపేట ఎ యిర్ పోర్టు నుంచి బయటకు వస్తు న్న సమయంలో ఒక్కసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమా.. మోదీ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది. హ ఠాత్పరిణమంతో హడలిపోయిన పోలీసులు కాన్వాయ్‌ను నిలిపి వేశారు. వెం టనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో ముంద స్తుగా కొన్ని గంటల ముందే ఆ మార్గం లో ట్రాఫిక్ నిబంధనలు విధించినప్పటికీ ఓ మహిళ నేత ఏకంగా కాన్వాయ్‌కి అడ్డు రావడం భద్రత లోపాల్ని ఎత్తిచూపుతోంది.






