11 May, 2026 | 2:09 AM

బ్రహ్మాజీవాడిలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం

11-05-2026 01:08 AM

తాడ్వాయి, మే, 10(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీ వాడి గ్రామంలో ఆదివారం సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుల సౌలభ్యం కోసమే మక్కలు కొనుగోలు కేంద్రాలను గ్రామాలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజన రఘుపతిరావు, నాయకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.