calender_icon.png 8 February, 2026 | 5:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్‌లో చేరిన రెండో వార్డు సభ్యులు

08-02-2026 04:01:05 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ రెండో వార్డు మెంబర్ చింతనూరీ మేఘమాల, మల్లేశం, వెంకటేష్‌లు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమం మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కార్తీక్ రెడ్డి, వార్డు మెంబర్లు తుడుం రవి, బాదే స్వప్న శ్రావణ్, లింగరాజు భవాని స్వామి, గౌరీ గారి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.