30 August, 2026 | 8:22 PM

Breaking News

సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •   గిన్నిస్ బుక్ లో రికార్డ్ సృష్టించిన సిఐకి ఘన సన్మానం   •  

చిరుత ఆచూకీ కోసం గాలింపు

01-07-2026 01:42 AM

మహబూబాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): వరంగల్, మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లోని ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో మూడు రోజుల క్రితం చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. రాగంపేట గ్రామంలోని ఓ రైస్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు చిరుత పులి సంచారం రికార్డు కావడంతో గ్రామస్తులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.

స్థానిక పామ్ ఆయిల్ తోటలో చిరుత పులి పాదముద్రలు కనిపించినట్లు చెబుతున్నారు. అయితే చిరుత పులి జాడ కనిపించి మూడు రోజులైనప్పటికీ ప్రస్తుతం అది ఎటువైపు వెళ్లి ఉండవచ్చనే అంశంపై స్పష్టత లేదు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి జాడ కోసం అన్వేషిస్తున్నారు.

చిరుత పులి కొత్తగూడా, గూడూరు అటవీ ప్రాంతానికి వెళ్లే అ వకాశం ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు ఒంటరిగా రాత్రిపూట బయటకు రావద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో సంరక్షించాలని, చిరుత జడ తెలిస్తే సమాచారం ఇవ్వా లని అటవీశాఖ గూడూరు రేంజ్ అధికారి ప్రసాదరావు సూచించారు. మూడు రోజులుగా చిరుత పులి ఈ ప్రాంత ప్రజలకు కం టిమీద కునుకు లేకుండా చేస్తోంది.