30 August, 2026 | 9:19 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

జిల్లా ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ సేవలు

01-07-2026 01:44 AM

వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 30 (విజయక్రాంతి): ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్‌ఆర్  నిధులతో  ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎం.ఆర్.ఐ  యంత్రాన్ని సోమవారం సీఎం హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణా రావు,  జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.