1 July, 2026 | 2:49 AM

బాసరలో భూ పరీక్షలు ప్రారంభం

01-07-2026 01:42 AM

భైంసా, జూన్ 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా జ్ఞాన సరస్వతి అమ్మవారి బాసర ఆలయ పునరుద్ధరణ పనుల కోసం ఇంజనీర్లు భూపరీక్షలను ప్రారంభించారు. అమ్మవారి ప్రధాన ఆలయం ముందు ప్రత్యేక యంత్రాల సాయంతో భూ పరీక్షలు నిర్వహించి ప్రభుత్వానికి భూమి స్వభావ నివేదికను ఇవ్వనున్నారు.

బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవలే2 25 కోట్లు కేటాయించి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పనులకు శంకుస్థాపన ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి పనులకు భూ పరీక్షలు నిర్వహించడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక ఇంజనీర్లు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు.