శ్రీరంగాపూర్‌లో శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన
31-08-2026 10:18 PM
శ్రీరంగాపూర్: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (టీఆర్‌వీకే) వనపర్తి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం సోమవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో క్షేత్ర సందర్శన నిర్వహించింది. టీఆర్‌వీకే సమన్వయకర్త డా. ఎన్.నవత, ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త డా. ఎం. శంకర్, కీటక శాస్త్రవేత్త శోభా రాథోడ్ ఆధ్వర్యంలో షేర్‌పల్లి, నగరాల, జనంపేట్, వెంకటాపూర్ గ్రామాల్లో వరి, మినుము, వేరుశనగ, పత్తి పంటలను పరిశీలించారు. పంటల్లో పోషక లోపాలు, కలుపు మొక్కలు, చీడపీడలను గుర్తించి రైతులకు తగిన సాంకేతిక సూచనలు అందించారు. పంటలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన మందులను సరైన మోతాదులో మాత్రమే వినియోగించాలని సూచించారు.






