31 August, 2026 | 11:02 PM

బిజెపి మహా దీక్షను విజయవంతం చేయాలి

31-08-2026 10:16 PM

నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్

ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో 22ఏ భూముల పేరుతో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న రెండు రోజుల మహా దీక్షను విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉట్నూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  చేపట్టిన రెండు రోజుల దీక్షను విజయవంతం చేయాలని కోరారు. రెండు రోజుల దీక్ష శిబిరానికి ఉట్నూరు మండల శాఖ తరపున కార్యకర్తలు నాయకులు దీక్షలో పాల్గొనాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో బిజెపి ఉట్నూరు మండల అధ్యక్షులు బింగి వెంకటేష్ ,జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గాలి శ్రీకాంత్, ఎస్టీ మోర్చా కార్యదర్శి రాథోడ్ శేషరావు, మండలప్రధానకార్యదర్శి సాల్గర్ రవీందర్ పాల్గొన్నారు.