మండల స్థాయి ఎస్జిఎఫ్ పాఠశాల క్రీడా పోటీలు
చందుర్తి,(విజయక్రాంతి): మండల స్థాయి ఎస్ జి ఎఫ్ పాఠశాల క్రీడలు సెప్టెంబర్ 2 మరియు 3 తేదీలలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి వినయ్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 02 (బుధవారo) రోజున బాలికల 17 మరియు 14 సంవత్సరాల లోపు విభాగాల్లో కబడ్డీ కోకో మరియు అథ్లెటిక్స్ నిర్వహించబడునని, అలాగే సెప్టెంబర్ 03 (గురువారం) రోజున బాలుర, 17 మరియు 14 సంవత్సరాల లోపు విభాగాల్లో కబడ్డీ కోకో మరియు అథ్లెటిక్స్ నిర్వహించబడునని తెలిపారు.
14 విభాగంలో 2013 సంవత్సరం ఆపై జన్మించిన విద్యార్థులు అర్హులని,17 విభాగంలో 2010 ఆపై జన్మించిన విద్యార్థులు అర్హులని తెలిపారు.క్రీడా పోటీలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులు ఎవరి లంచ్ బాక్స్ వారే తప్పనిసరిగా తీసుకొని రావలన్నారు .మండల పరిధి లోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ క్రీడా పోటీలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.






