1 September, 2026 | 12:29 AM

రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: ఏబీవీపీ

31-08-2026 11:42 PM

హుజురాబాద్(విజయక్రాంతి): రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎంఆర్ఓకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ హుజురాబాద్ టౌన్ సెక్రటరీ సాయి చరణ్ రెడ్డి మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేసి కళాశాలలకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.