1 September, 2026 | 12:37 AM

వైభవంగా గంగ తెప్పోత్సవం శోభయాత్ర

31-08-2026 11:55 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం డివిజన్ పరిధి కాలనీల సముదాయ గంగపుత్ర-(బెస్త) సంక్షేమ సంఘము, నారపల్లి వారి ఆధ్వర్యంలో గంగామాతకు భోనాల సమర్పణోత్సవం భోనాల పండుగ గంగ తిప్పోత్సవంల యొక్క సంయుక్త శోభాయాత్ర కన్నుల పండువగా అత్యంత వైభవంగా  ప్రారంభమై నారపల్లి  పెద్ద చెరువు వద్ద ముగిసినది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ మేము మొదటి సారిగా తెప్ప ఉత్సవము బోనాలని ఆతల్లికి సమర్పిస్తున్నామని అందరిని చల్లగా చూడాలని కోరడం జరిగిందన్నారు. మా సంఘ సభ్యులు, ప్రజలందరూ ఇలాగే సహకరిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు మారెన్నో చేస్తానని తెలియజేశారు.