పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
10-06-2026 05:32 PM
ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్
ఖానాపూర్,(విజయక్రాంతి): పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని పాఠశాలలు పున ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మండలంలోని అన్ని పాఠశాలల్లో పరిసరాలు బాగు చేయాలని ఖానాపూర్ ఎంపీడీవో రాధా రాథోడ్ అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి తర్లపాడు గ్రామాల ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో పరిశుభ్రతను సమీక్షించారు. పాఠశాలలు 15వ తేదీన ప్రారంభమయ్యే నాటికి వసతులు సరిచూసుకోవాలని ఆమె అన్నారు.






