లంబాడితండాలో పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాo
- గుడుంబా, మద్యం స్వాధీనం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబాడి తండాలో తెల్లవారుజామున బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సోదాలో జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, 2 డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా 20 మోటార్‌సైకిళ్లు,2 ఆటోలు,2 ట్రాక్టర్ల పత్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ గ్రామస్తులతో మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని తెలియజేసి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.






