2 September, 2026 | 3:26 PM

పేరూరులో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం

02-09-2026 | 02:57pm

కౌకుంట్ల: కౌకుంట్ల మండల పరిధిలోని పేరూరు గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Dr. YS Rajasekhar Reddy) వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ కొత్త శృతి అరవింద్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజలకు అందించిన సేవలను, సంక్షేమ పథకాలను గ్రామస్తులు స్మరించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ(Congress Party) గ్రామ అధ్యక్షుడు ఆర్.బి. రాజు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్తులు పేర్కొన్నారు.