2 September, 2026 | 3:49 PM

గాంధీనగర్ లో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి

02-09-2026 | 02:54pm

మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని గాంధీనగర్ లో "విద్యుత్ సబ్ స్టేషన్"(Electrical substation) ఏర్పాటు చేయాలని గణపురం మండలం(Ganapuram Mandal) మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గణపురం మండలంలోని "మైలారం, గాంధీనగర్,  కర్కపల్లి, లక్ష్మారెడ్డిపల్లి" గ్రామాల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గాంధీ నగర్ లో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, గణపురం సబ్ స్టేషన్  నుండి దూరం ఎక్కువ అవ్వడంతో 4 గ్రామాల ప్రజలు నిరంతరం విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారని, రావాల్సిన విద్యుత్ కంటే హెచ్చుతగ్గులు రావడంతో రైతుల మోటర్లు కాలిపోతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం, స్థానిక జిల్లా కలెక్టర్ , విద్యుత్ సంస్థ అధికారులు,  స్పందించి గాంధీనగర్ లో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని పూర్ణచంద్రారెడ్డి అన్నారు. సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం నాలుగు గ్రామాల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.