శిరీషకు న్యాయం చేయాలి
బెజ్జూర్ విజయ క్రాంతి: రాజధాని నగరం హైదరాబాదు(Hyderabad)లో ఆదివాసి అమ్మాయి శిరీష(Sirisha)ను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితుని కఠినంగా శిక్షించాలని మండల కేంద్రంలో ఆదివాసి సమాజం తరఫున కొవ్వొత్తులతో ర్యాలీ(Candlelight rally) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి మండల అధ్యక్షులు కోరేత తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణలో ఏ మూల చూసిన ఆదివాసులపైన అన్ని రకాలుగా అణచివేత అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి.. వీటంతటికీ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆదివాసులకు రక్షణ కల్పించాలని అదేవిధంగా చనిపోయిన అమ్మాయి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియో,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి సంఘటనలో పునరావృత్తం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఆదివాసులకు రక్షణ కల్పించాలని.. లేనియెడల మరో ఆదివాసి ఉద్యమం చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సమాజం నాయకులు సీడం సకారామ్ పెద్దల సుగుణ తలండి రాములు, ఆత్రం సాయి మానేపల్లిమల్లేష్ పెద్దల శంకర్ మేడి సతీష్ ఎడ్ల మహేష్ వెంకటేష్ సంతోష్ మేకల శ్యామ్ రావు రమేష్ నైతం విలాస్ ఆత్రం లక్ష్మీనారాయణ, తలండి మధుకర్ తదితరులు పాల్గొన్నారు






