2 September, 2026 | 3:33 PM

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా

02-09-2026 | 02:49pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో జనసేన నాయకులు, జనసైనికులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులకు స్లేట్లు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అడ్‌హాక్ కమిటీ యువజన విభాగం సభ్యులు,  జిల్లా నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా నాయకుడు  వినీత్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి సేవలందిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కాచం క్రాంతి, పురుషోత్తం పవన్ కళ్యాణ్, చిచ్చోల్కర్ రాజు, దివి చారి, ఉట్టేజ్ చారి, రాపర్తి సతీష్, శివ హర్ష, వైరాగడే రమేష్, వైరాగడే రవి, సాయి, వైరాగడే కృష్ణ, మహేష్, దయసాగర్, సాయి తేజ, కార్తీక్, శ్రీనివాస్, హర్షిత్, చందు, జనసైనికులు, అభిమానులు పాల్గొన్నారు.