27 June, 2026 | 1:54 AM

ఇంటింటికీ సర్ పత్రాలు అందజేత

27-06-2026 12:43 AM

గండీడ్, జూన్ 26 : మండల కేంద్రంలోని ఓటర్ సవరణలో భాగంగా సర్ పత్రాలను ఇంటింటికి తిరిగి సంబంధిత అధికార యంత్రం అందజేసింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భగవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సవరణలకు సంబంధించి సరిచూసుకోవాలని సూచించారు.

ఎక్కడ ఎలాంటి తప్పిదమున్న సమగ్రంగా పరిశీలించి కుటుంబ సభ్యులు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో సర్ పత్రాలను నిర్లక్ష్యం చేయకూడదని ఎన్నికల సమయంలో మాత్రమే ఓటు గురించి తాపత్రయపడితే ఉపయోగం ఉండదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుమ్ముడాల చెన్నయ్య, బిఎల్‌ఓ లు నహీదా, వేపురి చెన్నమ్మ, జగన్మోహన్ గౌడ్,  ర్యాకం కేశవులు తదితరులు పాల్గొన్నారు.