30 July, 2026 | 6:32 PM

మొదటి వేతనం ఆలయానికి విరాళం

30-07-2026 05:31 PM

కుబీర్,(విజయక్రాంతి): కుంటాల మండలంలోని ఓలా గ్రామానికి చెందిన రాసూరు శ్రీనివాస్ నిరంజన్ కూతురు అంకిత గురువారం మొదటి వేతనం 30000 ఆలయానికి విరాళం ఇచ్చారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదివిన అంకిత ఇటీవలే ఓ ప్రైవేట్ కంపెనీలో 30 వేల జీతం రావడంతో మొదటి జీతాన్ని మొక్కులో భాగంగా గజ్జలమ్మ ఆలయానికి విరాళంగా అందించినట్లు తెలిపారు. విరాళాన్ని అందించిన కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.