30 July, 2026 | 6:34 PM

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి

30-07-2026 05:24 PM

నిజామాబాద్,(విజయ క్రాంతి): నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 11 మంది అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లకు (ఏఎస్ఐలు) సబ్ ఇన్‌స్పెక్టర్లుగా (ఎస్‌ఐలు) పదోన్నతి లభించింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పదోన్నతి పొందిన అధికారులు గురువారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పదోన్నతి పొందిన అధికారులను అభినందిస్తూ, కొత్త బాధ్యతలను మరింత నిబద్ధతతో, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా నిర్వహించాలని సూచించారు. చాలాకాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న అధికారులకు ఈ అవకాశం రావడంతో పోలీసు సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

పదోన్నతి పొందిన అధికారులు:

బి. జాన్సన్ – మహిళా పోలీస్ స్టేషన్, నిజామాబాద్

జి. రాజేశ్వరెడ్డి – వేల్పూర్ పోలీస్ స్టేషన్

వి. అనిల్ కుమార్ – ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్

శ్రీనివాస్ రెడ్డి – ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్

బి. సాయిలు – టౌన్-2 పోలీస్ స్టేషన్, నిజామాబాద్

ఎం.డి. లాయక్ అలీ – టౌన్-4 పోలీస్ స్టేషన్, నిజామాబాద్

డి. చిన్న గంగారం – టౌన్-1 పోలీస్ స్టేషన్, నిజామాబాద్

ఎస్.కె. గఫర్ – నవీపేట్ పోలీస్ స్టేషన్

కె. బాబురావు – బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్

పి. శంకర్ – జక్రన్‌పల్లి పోలీస్ స్టేషన్

రేణుకా దేవి – రుద్రూర్ పోలీస్ స్టేషన్.

పదోన్నతి పొందిన అధికారులకు పోలీస్ కమిషనర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విధి నిర్వహణలో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలందించాలని ఆకాంక్షించారు.