27 June, 2026 | 3:45 AM

పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్‌పై ఎస్సీ డీడీ కక్షసాధింపు చర్యలు

27-06-2026 02:06 AM

భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు 

చుంచుపల్లి, జూన్ 26 (విజయక్రాంతి ): జిల్లా వ్యాప్తంగా ఉన్నా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ లో పనిచేస్తున్న వర్కర్స్ పై జిల్లా సోషల్ వెల్ఫేర్ డిడి  శ్రీలత  కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని తక్షణమే ఆమె ఆలోచన మా ర్చుకోవాలని భారత కార్మిక సంఘాల సమా ఖ్య ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు గౌ ని నాగేశ్వరరావు అన్నారు

ఐఎఫ్టియు కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల  సమా వేశంలో వారు మాట్లాడుతూ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో పనిచేస్తున్న వర్కర్స్ కి 16 నెలలుగా వేతనాలు ఇవ్వకపోగా గ్రీవెన్స్ లో కలెక్టర్ తెలియజేసినందుకు వర్కర్స్ పట్ల కక్ష సాధింపు చర్యలు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఏలాంటి నోటీసులు ఇవ్వకుండా కొంతమంది ఉద్యోగాలు ఆపడం మరియు మగవారిని ఆడవారి హాస్టల్ కి,ఆడవారిని మగవాళ్ళ హాస్టల్ కి ఎలాంటి రిలీవింగ్ ఆర్డర్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయడం

వాచ్మెన్ స్వీపర్ గా స్వీపర్లను వంట కుక్ లుగా వంట కుక్ లని హెల్పర్స్ గా చేస్తూ వారిని బెదిరింపులకు గురిచేస్తూ పనిలోకి పోవాలని లేకుంటే డ్యూటీ నుంచి తీసేస్తామని చెబుతూ ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కొంతమంది డ్యూటీని నిలిపివేసిందని ఇది మంచి పద్ధతి కాదని తక్షణమే సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీలత గారిపై జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. 

ఎన్నో సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలకు 5 నుండి 10వేల మధ్య వేతనాలతో వారి కుటుంబ జీవనం నడిపించుకుంటున్నారని ఇప్పుడు అకస్మాత్తుగా నిబంధనలకు విరుద్ధంగా వేరే ఏరియాలకు హాస్టల్స్ కు పంప డం వలన రూమ్ రెంట్లు కట్టలేక పిల్లల చదివించలేక అనారోగ్యాల పాలై ఆరోగ్యం చూ పించుకోలేక చాలా ఇబ్బందులతో ఉన్నారని వారి పెండింగ్ వేతనాలు మొత్తం చెల్లించాలని వారు అన్నారు.

16 నెలలుగా హాస్టల్స్లో వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు వారి శ్రమకు తగ్గ ఫలితం కూడా ఇవ్వడం లేదు. ఈ వర్కర్స్ పై జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో ఆలోచించి నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న శ్రీలత గారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు గండూరి సంజీవరావు  ఉప్పరబోయి న రామ్మూర్తి రాజకుమార్ పార్వతి ప్రణయ్ కుమార్ రామ్ చరణ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.