15 June, 2026 | 2:20 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

స్పిన్‌మ్యాక్స్ కంపెనీలో గంజాయి కలకలం

10-06-2026 12:48 PM

- నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ (ఎన్‌డీడీ) బృందం చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు.

- ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉమాకాంత్ నాయక్ వద్ద 0.94 గంజాయి 3.93 గ్రాముల మాదకద్రవ్యం స్వాధీనం

- చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు.

చేవెళ్ళ,(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీ కందవాడ పరిధిలోని స్పిన్‌మ్యాక్స్ టైర్స్ కంపెనీ బారక్‌లో గంజాయి సేవిస్తున్న ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ లు ప్రకటన విడుదల చేశారు. జూన్ 9 మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈగిల్ టీమ్ అందించిన విశ్వసనీయ సమాచారంతో నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ (ఎన్‌డీడీ) బృందం చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల సందర్భంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఉమాకాంత్ నాయక్ (24) అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా, అతని వద్ద 0.94 గ్రాముల గంజాయి 3.93 గ్రాముల అనుమానాస్పద మాదక పదార్థం లభ్యమయ్యాయి. డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. చేవెళ్ళలో వరుస గంజాయి ఘటనల్లో ఇతర రాష్టాల వ్యకులు పట్టుబడటంతో స్థానిక ప్రజల్లో  భయందోళన రేపుతుంది.