30 March, 2026 | 1:10 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

మహాలక్ష్మితో రూ.10 వేల కోట్లు ఆదా

30-03-2026 12:00 AM
  1. త్వరలోనే మహిళలకు స్మార్ట్ కార్డులు జారీ 
  2. ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి

హైదరాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళ లు రవాణా ఛార్జీల మొత్తం రూ.10 వేల కోట్లను ఆదా చేసుకున్నారని ఆర్టీసీ ఎండీ వె. నాగిరెడ్డి తెలిపారు. ఆడబిడ్డలకు ఈ మొత్తం పొదుపుగా మారిందని, ఇది కేవలం ప్ర యాణం కాదని, తెలంగాణ ఆడబిడ్డల గెలు పు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర సామాజిక, ఆర్థిక ముఖ చిత్రంలో కొత్త అధ్యాయాన్ని లిఖించిందన్నారు.

మహిళా సాధికారత లక్ష్యంగా 2023 డిసెంబర్ 9న  ప్రారంభమైన ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల రవాణా చార్జీల మొత్తం నేటితో రూ.10 వేల కోట్ల మార్కును చేరుకుందని ఆదివారం ఆయన ప్రకటించారు. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే మహాలక్ష్మి సేవల సౌలభ్యం కోసం మహిళలకు త్వరలోనే స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.