19-02-2026 03:03:55 AM
హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆయన నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ నరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్‌టైనింగ్ స్క్రిప్ట్‌తో దర్శకుడు లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఎస్‌ఎస్ కాంచి, సురేశ్ గురు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ ప్రారంభోత్సవానికి టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్యఅతిథిగా హాజరై హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టారు. ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి ఫస్ట్ షాట్‌కు డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. “మా సినిమా జానర్ ఏంటి అని అందరూ అడుగుతున్నారు.
అందరి పెదాలపై నవ్వుల పూయించే చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నాం. రామ్ మిరియాల ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ ఒక కంప్లీట్ మూవీకి ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యదేవ్ కెరీర్‌లో ఇదొక పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా” అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల తదితర చిత్రబృందం పాల్గొన్నారు.