calender_icon.png 19 February, 2026 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదే టైటిల్‌తో?

19-02-2026 03:02:35 AM

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ యాక్షన్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జోర్డాన్ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో కనిపించనున్నారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా మూవీ లో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.

ఇదిలావుండగా, ఈ సినిమా రానుందని ‘డ్రాగన్’ అనే టైటిల్‌తో ఇప్పటివరకు ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో కొత్త టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైత్రీ మేకర్స్ సంస్థ నిర్మాత రవి యలమంచిలి గతంలోనే ‘డ్రాగన్’ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, ఫైనల్ టైటిల్ ఇంకా ఖరారు కాలేదని హింట్ ఇచ్చారు.

తాజాగా ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు చిత్రపరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, ఇది ఒక సంచలన నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే, ఇప్పటికే 2015లో రామ్‌చరణ్ కథానాయకుడిగా ‘బ్రూస్ లీ : ది ఫైటర్’ పేరుతో ఓ సినిమా వచ్చింది. దశాబ్దం తర్వాత అదే టైటిల్‌ను ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం వాడుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.