ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జోడీ
- వరల్డ్ నెం.1 జోడీపై సంచలన విజయం
- మిక్స్‌డ్ డబుల్స్‌లో ధృవ్,తనీశా ఓటమి
సింగపూర్, మే 30 : సింగపూర్ ఓపెన్ లో భారత డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత జంట 21 స్కోర్‌తో వరల్డ్ నెం1. జోడీ కొరియాకు చెందిన కిమ్ వోన్ సింగ్ జోడీపై విజయం సాధించింది. తద్వారా కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కొరియన్ జోడీకి సాత్విక్ జోడీ చుక్కలు చూపించింది. రెండు గేమ్స్‌లోనూ ఆధిపత్యం కనబరిచింది.
ఆదివారం జరిగే ఫైనల్స్‌లో భారత జోడీ ఇండోనేషియాకు చెందిన ఫజర్ అల్ఫియా, మహ్మద్ ఫిక్రీ జంటతో తలపడుతుంది. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. సెమీస్‌కు చేరి ఆశలు రేకెత్తించిన ధృవ్ కపిల జోడీ ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో భారత జోడీ 16 21 13 స్కోరుతో జపాన్‌కు చెందిన యుచి శిమోగమి, సయాకా హొబారా జోడీ చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్ ఓడిపోయినప్పటకీ తర్వాత పుంజుకుని స్కోర్ సమం చేసింది. అయితే మూడో గేమ్‌లో మాత్రం జపాన్ పెయిర్‌దే పైచేయిగా నిలిచింది. ఇది లా ఉంటే పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఇప్పటికే ఇంటిదారి పట్టారు.






