23 May, 2026 | 8:11 AM

సత్యసాయి సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలి

24-11-2025 12:00 AM

కలెక్టర్ కార్యాలయ ఏ.ఓ. భూపాల్ రెడ్డి

గద్వాల, నవంబర్ 23 : మానవత్వానికి మారుపేరుగా సత్య సాయి బాబా నిలిచారని ఆయన సేవలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని కలెక్టర్ కార్యాలయ ఏ.ఓ. భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం సత్య సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా శత జయంతి ఉత్సవాలను ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ సత్యసాయి బాబా చిత్రపటానికి ఏఓ భూపాల్ రెడ్డి సత్య సాయిబాబా భక్తులతో కలిసి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి పూజలు నిర్వహించారు.

సాయిబాబా చేసిన సేవలను కొనియాడుతూ, కరువు జిల్లాలలో ఏర్పడిన నీటి ఎద్దడిని తీర్చేందుకు ప్రత్యేక పంపులను ఏర్పాటు చేసి తాగు నీటిని అందించిన మహనీయుడన్నారు. ప్రభుత్వం ఎలాగైతే ఉచిత పథకాలను అందిస్తుందో అలాగే భగవాన్ సత్య సాయిబాబా ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్య, వైద్యం ఇతర సేవకార్యక్రమాలు చేస్తున్నరన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ సాయి ప్రకాష్, సభ్యులు సత్తయ్య గుప్తా, జయ లక్ష్మమ్మ, లత, గీత, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.