సర్లో మ్యాపింగ్ కానీ వారికి నోటీస్ అందజేత
27-08-2026 05:48 PM
బెజ్జూర్ ఆగస్ట్ 27 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామంలో ఓటరు సర్ ప్రక్రియలో మ్యాపింగ్ కానీ వారికి నోటీసులు అందించినట్లు సర్పంచ్ మన్యంపల్లి మల్లేష్ తెలిపారు. మ్యాపింగ్ కోసం 12 రకాల ధ్రువపత్రాల గురించి వివరించడం జరిగిందని తెలిపారు. కావున సర్ ప్రక్రియలో నోటీసులు అందిన వారు తప్పనిసరిగా ప్రణాళిక ప్రకారంగా 12 రకాల ధ్రువపత్రాలు అందించాల్సి ఉంటుందని తెలిపారు. సర్ ప్రక్రియ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






