ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల కమిటీ ఎన్నిక
మణుగూరు,(విజయక్రాంతి): దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అణగారిన కులాల హక్కులు, రాజ్యాధికారం కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల జిల్లా ఇన్‌చార్జి ములకలపల్లి రవి మాదిగ పిలుపునిచ్చారు. మణుగూరు మండలం బిసి కార్యాలయంలో గురువారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల కమిటీ నిర్మాణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ములకలపల్లి రవి మాదిగతో పాటు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మణుగూరు మండల ఇన్చార్జి బోయ జగన్నాథం మాదిగ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుల వివక్ష కారణంగా దళితులు, అణగారిన వర్గాల జీవితాలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు. సామాజిక పరివర్తకుడు, మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి , మాదిగ దండోరా ఉద్యమాల ద్వారా దళితుల అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం పోరాటం సాగిందని పేర్కొన్నారు. అణగారిన కులాల హక్కుల సాధనతో పాటు భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి అనుబంధ సంఘాల సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
మహాజనులంతా ఐక్యంగా ఉండి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మార్పీఎస్ మణుగూరు అధ్యక్షులు పొడుతూరి కళ్యాణ్ బాబు మాదిగ అధికార ప్రతినిధిగా కోడిపాక ప్రదీప్ మాదిగ లు మరియు సభ్యులు ఎన్నికైన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము హుస్సేన్ మాదిగ, బోయిల కృష్ణ మాదిగ, ఇసుకల కొండయ్య మాదిగ, చెక్క రమేష్ మాదిగ, ధనసలపురి కిరణ్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు . ఎమ్మార్పీఎస్ సంస్థను గ్రామస్థాయిలో సంస్థను బలోపేతం చేసి అణగారిన వర్గాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.






