29 August, 2026 | 5:29 PM

రాజంపేటలో ఫారం పాండ్ నిర్మాణ పనులు

29-08-2026 04:48 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొడవెల్లి మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర హాస్టల్ సమీపంలో రైతు మంతెన బాపు పొలంలో ఉపాధి హామీ పథకం కింద ఫారం పాండ్ నిర్మాణ పనులు చేపట్టారు. వర్షపు నీటిని నిల్వ చేసి వ్యవసాయానికి వినియోగించుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపునకు ఫారం పాండ్లు ఎంతగానో ఉపయోగపడతాయని, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి పనులను మరింతగా చేపట్టాలని  సర్పంచ్  పోచయ్య తెలిపారు.

ఈ పనులను సర్పంచ్ పోచయ్య, వార్డు సభ్యుల జిల్లా కన్వీనర్ గులాం జావిద్, వార్డు సభ్యులు జబరి కిషోర్, తిరుసూల నానయ్య పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సాయి కుమార్, రమేష్, వి.బి. రామ్ జీ, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.