కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ నర్సిములు
చేగుంట,విజయక్రాంతి: చేగుంట మండల పరిదిలోని పెద్ద శివనూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రం ను , మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు అధికారులతో కలిసి ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ నర్సిములు, అనంతరం రైతుల ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను దళారులకు కాకుండా, ప్రభుత్వ ఐకెపి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని దళారులను అమ్మి మోస పోవద్దన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్ కు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. అనంతరం సిసి స్వామి మాట్లాడుతూ మండలంలో ఇప్పటివరకు ఐకెపి సెంటర్ ద్వారా 19 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు,ఈ కార్యక్రమం చేగుంట ఎఎంసి డైరెక్టర్ లు మొహమ్మద్ ముజామిల్, అన్నం ఆంజనేయులు, బాల్ రెడ్డి,సెక్రటరీ ప్రశాంత్,సీసీ స్వామి, వార్డు సభ్యులు బండారి రాములు, వి ఓ ఏ పద్మ,కార్యకర్తలు పాల్గొన్నారు.




