28 July, 2026 | 4:21 PM

గ్రామాలలో పచ్చదనాన్ని పెంచుదాం

28-07-2026 03:33 PM

బోథ్,(విజయక్రాంతి): గ్రామాలలో పచ్చదనాన్ని మరింతగా పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కౌట బి గ్రామ సర్పంచ్ ఓరుగంటి స్వామి విడిసి అధ్యక్షులు పిడుగు అశోక్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కౌట బి గ్రామం స్మశాన వాటికలో వి బిజీ రాంజీ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మొక్కలు నాటడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. గ్రామాలలో అల్లాదకరమైన వాతావరణం ఉండేందుకు ప్రతి ఇంటికి మొక్కలు నాటాలని సూచించారు కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రామ్ సింగ్ గ్రామ కార్యదర్శి అంజయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.