28 July, 2026 | 3:59 PM

మొక్కల పెంపకం... ప్రతి ఒక్కరి బాధ్యత

28-07-2026 03:15 PM

- దేవలమ్మ నాగారం గ్రామంలో వన మహోత్సవం

- సర్పంచ్ గౌరి శ్రీనివాస్ గౌడ్

చౌటుప్పల్,(విజయక్రాంతి): మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సర్పంచ్ గౌరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో మంగళవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ గౌరీ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌరీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి రెండు మొక్కల చొప్పున నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత సైతం తీసుకోవాలన్నారు.

మొక్కల పెంపకంతో అటవీ శాతం పెరిగి పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ అమరావతి, పంచాయితీ కార్యదర్శి సుధాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.