28 July, 2026 | 3:58 PM

సారు రాక బడి బయట ఆట

28-07-2026 03:13 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన కేశవ్ గూడ, నాగు గూడ గ్రామాలలోని ఏకో ఉపాధ్యాయ పాఠశాలలో చదువులు నేర్పే ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు మంగళవారం పాఠశాల ఎదుట ఆడుకుంటూ కనిపించారు. అయితే పాఠశాలలకు సంబంధించిన రికార్డులు ఆడిట్ ఉండడంతో ఉపాధ్యాయులు రికార్డింగ్ తీసుకొని ఆడిట్ అధికారుల దగ్గరికి వెళ్లినట్లు సమాచారం. అయితే ఉపాధ్యాయులు పాఠశాల మూయకుండానే వెళ్లిపోవడంతో మంగళవారం బడి ఉన్నట్టా లేనట్టా అనేది అర్థం కాక విద్యార్థులు సారు రాక కోసం ఎదురుచూస్తున్నారు.