28 July, 2026 | 4:22 PM

అంతా ఆమె కనుసన్నల్లోనే...

28-07-2026 03:31 PM

 ఏపిఎం నేనే.. సీసీ ని నేనే..

 నేను ఏది చెప్పినా వినాల్సిందే.. ఐ డోంట్ కేర్

 మండల సమాఖ్యలో అసలేం జరుగుతుంది...?

 ప్రజావాణిలో మొరపెట్టుకున్న పట్టించుకోని అధికారులు

చుంచుపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో చుంచుపల్లి మండలం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మండలం. ఇందులో డ్వాక్రా, వివోఏ, ఎంఎస్ లు ఉంటాయి. చుంచుపల్లి మండల సమైక్యలో అసలేం జరుగుతుందని ఆరోపణలు బయటికి వినపడుతున్నాయి. ఏది జరగాలన్న,ఏ పని కావాలన్నా, అంత ఆమె కను సన్నల్లోనే ఉంటుందని, ఆమెపై అధికారి అయినటువంటి ఏపిఎం ఉన్న, క్లస్టర్ వారిగా పని చేస్తున్నటువంటి సీసీలు ఉన్న ఐ డోంట్ కేర్ అంతా నేను చెప్పినట్టు వినాల్సిందే..! మండల సమైక్య కార్యాలయంలో ఏ బిల్లు పాస్ కావాలన్నా ఏ పని జరగాలన్న ఈ కార్యక్రమం నిర్వహించాలన్న ఆమె కనుసన్నల్లో జరుగుతున్నాయి అని అనుమానం వ్యక్తపరుస్తున్నారు.

చుంచుపల్లి మండలంలో కొంతమంది గ్రామ దీపికలని కూడగట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. మండల సమైక్యను బ్రస్టు పట్టిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఎవరైనా సరే ఆమె మాట వినకుంటే వ్యక్తిగతాన్ని బయటికి తీసి పరువులు పోయే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆమె వ్యవహార శైలి అందర్నీ ఆశ్చర్యపరుస్తా ఉంటది. కిందిస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మహిళా సంఘాలకు సంఘాలలో ఉన్నటువంటి మహిళ సభ్యులకి ఏ విషయాన్ని కూడా వివరించకపోగా వాళ్లని భయభ్రాంతులకు గురి చేస్తూ లోన్ల పేరుతో మీరు ఇంత కట్టాలి అంత కట్టాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న స్త్రీలు మహిళల్ని ఆందోళనకి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది.

పలువురుపై బెదిరింపులకు  పాల్పడుతూన్న అకౌంటెంట్ పనితీరు పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలం లో ఉన్నటువంటి గ్రామ దీపికలు, అకౌంటెంట్ వీరి జీతభత్యాలు పక్కన పెడితే వీరు కమిషన్లకు కక్కుర్తి పడి పలువురి డ్వాక్రా మహిళలపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ లోన్ల పేరిట మభ్యపెడుతూ మహిళలను వేధిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

ఈ విషయంపై పలుమార్లు పంచాయితీలు జరిగి పలువురు రాజకీయ నాయకుల్ని ఇందులో కలిగించుకునేలా వారి పాత్ర వారు పోషించి అందరినీ సముదాయించి వెళ్లిన మరల ఇదే తంతు తిరిగి పునరావృతం అవుతున్న పై అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.  చాలా కట్టుదిట్టంగా సిన్సియర్గా పనిచేసేటువంటి మహిళలను రాచి రంపాన పెడుతున్నారని అనుమానం కూడా లేకపోలేదు.

 ఆ నిశ్శబ్ద వెనుక ప్రక్షాళన జరుగుతుంది: ఏపిఎం సయ్యద్ అదిల్

చుంచుపల్లి మండల సమైక్య కార్యాలయంలో ఏమి జరుగుతుందో అన్ని విధాలుగా తెలుసు నా నిశ్శబ్దం వెనక నా నిశ్శబ్దం వెనుక ప్రక్షాళన కచ్చితంగా జరుగుతుంది. ప్రక్షాళన కచ్చితంగా జరుగుతోంది. మీరన్నట్టుగా నా దృష్టికి అనేక విషయాలు వచ్చాయి. గతంలో అంతా నేనే అన్నీ నేనే అనే మాట వాస్తవమే అయినప్పటికీ దానిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించి సరైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న అందులో భాగంగానే ఎమ్మెస్ లో ముగ్గురు సభ్యులను స్థానచలనం చేయటానికి ప్రణాళిక యుద్ధం చేస్తున్నాను మారుస్తున్నాను. మొత్తంగా చుంచుపల్లి మండలంలోని మండల సమాఖ్యలో ఏం జరుగుతోంది అనే దానిపై పూర్తి నిఘా నేత్రాన్ని ఏర్పాటు చేసి పలు అనుమానాలను, ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకురానుంది విజయ క్రాంతి.