21-02-2026 07:58:16 PM
సర్పంచ్ వెంకన్న
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గ్రామస్తుల, పాలకవర్గ సభ్యుల,యువకుల,దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ మండలంలోనే ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుదామని సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
అనంతరం గ్రామసభలో పలు అభివృద్ధి అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లింగంపల్లి రవీందర్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, పాఠశాల హెచ్ఎం నీరజ, వార్డుసభ్యులు నర్సింహా, మాగి మీనాక్షి, మర్రి లతీఫ్, గంట, సరితారామకృష్ణ, తవిడి సైదులు, శారద నాగరాజు, మూడవత్ తనేష్, స్రవంతి, అంగన్వాడి టీచర్ పుష్పలత, ఆయా శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.