ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పండుగలా జరుపుకుందాం
బోథ్, ఆగస్టు 2 (విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆగస్టు 9న ఆదివాసీలంతా పండుగలా జరుపుకోవాలని పాట్నాపూర్ రాయల్ సెంటర్ ఆడే భీమ్రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆదివాసి పటేళ్లు ప్రభుత్వ ఉద్యోగులు సర్పంచులు వివిధ సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెవరి పంద్రం శంకర్ మాట్లాడుతూ... మండల కేంద్రంలోని కొమరం భీం విగ్రహం వద్ద జరుపుకునే ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఆదివాసీలందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. లింగాపూర్ సార్ మేడి నైతం కృష్ణ కనక అమృత రావు ,నాగపూర్, సర్పంచ్ వాడావి దేవరావు పిప్పలదరిసర్పంచ్ కృష్ణ, పాట్నాపూర్ మాజీ సర్పంచ్ తులసి గోపాల్ మహేష్ పటేల్ ఆడే పుల్లన్న అందరూ గ్రామ పటేల్ పాల్గొన్నారు.






