calender_icon.png 21 February, 2026 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రణాళిక బద్ధంగా పరీక్షలు కొనసాగించాలి

21-02-2026 07:53:55 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్,(విజయక్రాంతి): జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షలు పకడ్బందీ ప్రణాళికతో నిర్వహించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించే చీప్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్  అధికారులకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... స్టోరేజ్ పాయింట్ నుండి పరీక్ష కేంద్రానికి ప్రశ్న పత్రాలు తీసుకుపోయే సమయంలో జాగ్రత్తలు వహించి పరీక్ష కేంద్రానికి చేరవేయాలని సూచించారు.

పరీక్షల నిర్వహణ సమయంలో ప్రతి విద్యార్థిని తనిఖీ నిర్వహించిన అనంతరం పరీక్ష కేంద్రంలోనికి పంపించాలని తెలిపారు. ప్రతి పరీక్ష పరీక్షకు సమయం ఎక్కువగా ఉన్నందున మరుసటి రోజు వచ్చే పరీక్షకు విద్యార్థులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయ, పరీక్షల విభాగం అధికారి కరుణాకర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి, మండల విద్యాధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.