2 August, 2026 | 3:19 PM

మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు విస్తృత పర్యటన

02-08-2026 02:11 PM

మంథని నియోజకవర్గంలో విస్తృత పర్యటన 

మంథని, ఆగస్టు 02విజయక్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) సోమవారం రేపు మంథని నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేపట్టనున్నారు. విద్య, ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి, వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఉదయం 9 గంటలకు మంథనిలోని శివకిరణ్ గార్డెన్‌లో మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'మన ఊరు–మన కోచింగ్ సెంటర్' ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఎస్‌ఎల్‌బీ గార్డెన్‌లో టీ వర్క్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాఠశాల విద్యార్థుల క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 10.30 గంటలకు మంథని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, కోకాకోలా ఫ్యాక్టరీ ప్రతినిధులు, ఇతర పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో కలిసి అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.ఉదయం 11 గంటలకు బొక్కల వాగు అభివృద్ధికి సంబంధించిన ప్రజెంటేషన్‌లో కంపెనీ ప్రతినిధులతో కలిసి పాల్గొని ప్రతిపాదిత పనులపై చర్చించనున్నారు. ఉదయం 11.30 గంటలకు మంథని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో నూతన డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ వైద్య సేవల అభివృద్ధిపై సమీక్ష చేపట్టనున్నారు.

తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు రత్నాపూర్ గ్రామంలో ప్రతిపాదిత కోకాకోలా పరిశ్రమ ఏర్పాటు కోసం ఎంపిక చేసిన స్థలాన్ని జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు పర్యటనతో మంథని ప్రాంతంలో విద్య, ఉపాధి, వైద్య సేవలు, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.