2 August, 2026 | 2:53 PM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్

02-08-2026 01:25 PM

ఉట్నూర్, ఆగస్టు 2(విజయక్రాంతి):​ ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ  ప్రాజెక్ట్ అధికారి  మంద మకరందు ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రి దృష్టికిప్రాజెక్ట్ అధికారి వివరాలను వెల్లడించారు. గిరిజన ఏజెన్సీ పరిధిలోని మారుమూల గ్రామాలు, తండాలు, గూడేలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు గిరిజనుల సామాజిక, ఆర్థిక పురోగతికి చేపడుతున్న చర్యలను వివరించారు.

ఏజెన్సీ ప్రాంతంలో మౌలిక వసూలు కల్పించుటకు  సప్త గిరి పథకాన్ని తీసుకువచ్చి ప్రతిరోజు అధికారులతో  గిరిజనులకంతున్న సంక్షేమ పథకాలపై  పర్యవేక్షణ చేస్తున్నామని వివరించారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యంతో పాటు విద్య వైద్యం తక్షణమందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాను వివరించారు. గిరిజన యువతకు స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పిఓకు సూచనలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం గిరిజన సంక్షేమ కోసం  కట్టుబడి ఉందని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గిరిజనులకు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.