25 April, 2026 | 8:17 PM

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

25-04-2026 06:48 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామపంచాయతీ మూడోవ వార్డు లో ఐదు లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి 90 మీటర్ల పొడవుతో మంజూరైన నూతన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి శనివారం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంజూరైన ఈ సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరిందని తెలిపారు. గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని,ఇకపై ఆ సమస్య తీరుతుందని అన్నారు.రాబోయే రోజుల్లో మూకమామిడి పంచాయతీ పరిధిలో అన్ని గ్రామల అభివృద్ధికి మరిన్ని నిధులు తెచ్చి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.