19-02-2026 05:15:36 PM
జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కి ముఖ్య అతిధిగా హాజరై టాస్ వేసి ఆట ప్రారంభించిన కలెక్టర్ మూసి నది స్పెషల్ ఆఫీసర్, విద్యాశాఖ డైరెక్టర్ వెంకట్ నర్సింహా రెడ్డి.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు ఆటలు మానసిక ఉల్లాసన్ని ఇస్తాయి అన్నారు.ఆరోగ్యంగా ఉండాలి అంటే క్రీడాలు ఆడాలి అని అన్నారు. అనంతరం క్రీడాకారులు కలెక్టర్ ను సన్మానించారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్ గణేష్, వార్డు సభ్యులు బత్తిని శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొంపెల్లి మహేష్, పాండవుల ప్రశాంత్ గ్రామ నాయకులు,క్రీడాకారులు పనుగట్ల వంశీ,సందీప్ కుమార్,బాలరాజ్, ఎండీ అజామ్,సంపత్ తదితరులు పాల్గొన్నారు.