calender_icon.png 19 February, 2026 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

19-02-2026 05:13:58 PM

​మాడ్గుల,(విజయక్రాంతి): మాడ్గుల మండలంలోని నల్లవారిపల్లి, తుర్కల కుంట తండా గ్రామాలకు వెళ్లే రహదారిలో, డంపింగ్ యార్డ్ సమీపంలో ఉన్న వాగుపై వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి(MLA Kasireddy Narayan Reddy) గురువారం గ్రామ సర్పంచ్ జగన్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ వినతి పత్రం అందజేశారు. గతంలో ఉన్న కల్వర్టు బ్రిడ్జి భారీ వర్షాలకు కొట్టుకుపోవడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని సర్పంచ్ వివరించారు.

వర్షాకాలం వస్తే వాగు దాటడం ప్రాణసంకటంగా మారుతోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  దీనికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులను త్వరలోనే కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చూస్తానని పేర్కొన్నారు.  కార్యక్రమంలో సీనియర్ నాయకులు సూదిని శ్రీనివాస్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పెద్దయ్య లు పాల్గొన్నారు.