7 March, 2026 | 11:08 AM

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీకి సంజూ నామినేట్

07-03-2026 12:12 AM

దుబాయ్, మార్చి 6 : టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ నామినీల పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు. భారత్ తరఫున ఈ అవార్డుకు ఓపెనర్ సంజూ శాంసన్ నామినేట్ అయ్యాడు. సంజూ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 232 పరుగులు చేశాడు.  ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరడంలో సంజూ కీలకపాత్ర పోషించాడు.సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. తర్వాత సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి భారత్‌ను  ఫైనల్‌కు చేర్చాడు.