ఆకట్టుకున్న సంఘం శరణం గచ్చామి నాటకం
నస్పూర్,(విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితంపై ప్రదర్శించిన సంఘం శరణం గచ్చామి నాటకం ఆద్యాంతం అందరినీ ఆకట్టుకుంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీచే శనివారం సాయంత్రం సింగరేణి ఆధ్వర్యంలో నస్పూర్ సీఈఆర్ క్లబ్ ప్రాంగణంలోని గోదావరి ఫంక్షన్ హాల్లో ఈ నాటికను ప్రదర్శించగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, స్థానికులు హాజరయ్యారు. శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆదివారం సాయంత్రం ఇదే ప్రాంగణంలో మహాత్మా జ్యోతీ బా పూలే గారి జీవితంపై సత్యశోధన నాటకం ప్రదర్శించబడునని, దీనికి సైతం పెద్ద ఎత్తున్న హాజరవ్వాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ప్రతినిధులు బ్రాంచి సెక్రెటరీ బాజీ సైదా, ముస్కే సమ్మయ్య, మోతుకూరి కొమురయ్య, ఎస్ఓ టు జీఎం కృష్ణ ప్రసాద్, ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, డీజీఎం(పర్సనల్) అనిల్ కుమార్, డీజీఎం (సివిల్) ఆనంద్ కుమార్, ఇతర అధికారులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, ఎస్సీ & ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు,స్థానికులు, పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు.






