8 August, 2026 | 9:57 PM

ఆదర్శంగా 15వ వార్డ్

08-08-2026 08:49 PM

ముమ్మరంగా సీసీ రోడ్ల పనులు

కల్లూరు,(విజయక్రాంతి): మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పనులు వేగవంతం చేస్తోంది.ఇందులో భాగంగా 15వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణ పనులను కౌన్సిలర్ యాస నాగమణి శ్రీకాంత్ శనివారం ప్రారంభించారు. కప్పల బంధం రోడ్డులో ఎస్‌కే జానీ ఇంటి సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

మరికొద్ది రోజుల్లోనే 15వ వార్డులో మిగిలిన అభివృద్ధి పనులను పూర్తిచేసి,వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రోడ్డు ప్రాంత మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకుడు ఖాసీం తదితరులు పాల్గొన్నారు.