18 April, 2026 | 5:37 PM

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

18-04-2026 04:15 PM

మూడు ట్రాక్టర్ల సీజ్ 

కోహెడ: కోహెడ మండలం నారాయణపూర్ గ్రామం ఎల్లమ్మ వాగు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు ను  పట్టుకున్నట్లు ఎస్ఐ అభిలాష్ తెలిపారు. ఈ సందర్బంగా ఎస్ఐ అభిలాష్ మాట్లాడుతూ.. నారాయణపూర్, శ్రీరాములపల్లి గ్రామం మీదుగా హుస్నాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న విషయం నమ్మదగిన సమాచారం మేరకు తమ సిబ్బంది దాడులు నిర్వహించారన్నారు. అక్కడ ఇసుక లోడ్ తో ఉన్న మూడు ట్రాక్టర్ల ను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు చెప్పారు. ఇసుక ను అక్రమంగా రవాణా చేస్తున్న నారాయణపూర్ కు చెందిన మారుపాక శివశంకర్(26), నాము ప్రదీప్(23), బొల్లి శ్రీనివాస్(40) ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కాగా ఇసుక రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, నిందితులకు జైలు శిక్ష తప్పదని ఎస్ఐ హెచ్చరించారు.