18 April, 2026 | 5:39 PM

దాసుతండా అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడ్ ప్రోగ్రాం నిర్వహణ

18-04-2026 04:14 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం దాసుతండా గ్రామపంచాయతీ దాసుతండా అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడ్ ప్రోగ్రాంను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ సెక్టార్ సూపర్వైజర్ అనురాధ మాట్లాడుతూ.. 0-6 సంవత్సరాల పిల్లల పోషణ ఆరోగ్యం, మొదట అభివృద్ధి మెరుగుపరచడం తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రులు, సంరక్షకులు పిల్లల ఎదుగుదలలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడం గురించి వివరించారు.

ఈ కార్యక్రమానికి సర్పంచ్ భూక్యా చందర్ సింగ్  హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పోషకాహారం విలువల గురించి వివరించారు.  జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ కళ్యాణి మాట్లాడుతూ బాలల హక్కులు చట్టాలు, బాల్య వివాహాల నిరోధక చట్టం, అక్రమ దత్తత, బడి బయట బాలలు, బాలల పరిరక్షణ కమిటీల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం బలరాం,  అంగన్వాడీ టీచర్స్ మల్లీశ్వరి,  జ్యోతి , మంగమ్మ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, కిశోర బాలికలు, గ్రామస్తులు పాల్గొన్నారు.