2 July, 2026 | 4:41 PM

Breaking News

బహిరంగ చర్చకు వెనక్కి తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వమే: సిలివేరి సత్యనారాయణ   •   ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •  

కాంగ్రెస్‌పై విపక్షాల మండిపాటు

21-03-2026 12:00 AM

మలక్‌పేట్, మార్చి 20 (విజయ్ క్రాంతి) : భోనగిరి వక్ఫ్ భూమి వివాదం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  మాజీ హోంమంత్రి మమూద్ అలీ తీవ్రంగా విమర్శించారు. అజంపురా లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీయుల్లా ఖాన్, బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఆజం అలీ తో కలిసి మాట్లాడుతూ యాదాద్రి-భువనగిరి జిల్లా భోంగిర్‌లోని సర్వే నంబర్ 902లో (ఎకరాలు 3-23 గుంటలు) వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో పూర్తిగా విఫలమైందని, సున్నితమైన మత సంబంధిత అంశాలను సరిగా నిర్వహించలేకపోయింద ని ఆరోపించాయి.

కాంగ్రెస్ పాలనలో వక్ఫ్ బోర్డు దిశాహీనంగా మారింది. తన ఆస్తులను గుర్తించడంలో కూడా విఫలమవుతోం దని,  దీంతో అనవసర వివాదాలు తలెత్తుతున్నాయన్నారు. గత నాలుగేళ్లుగా అదే స్థలంలో ఎటువంటి వివాదం లేకుండా రం జాన్, ఈద్ నమాజ్లు నిర్వహించారని వారు గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్వినియోగం వల్ల కోర్టులు జోక్యం చేసుకుని మత కార్యక్రమాలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.